ప్రభువు (యేసుక్రీస్తు) నామమునుబట్టి ప్రార్థనచేయు
వాడెవడోవాడు రక్షింపబడును.
- రోమీయులకు - 10 : 13


ప్రభువు (యేసుక్రీస్తు) నామమునుబట్టి ప్రార్థనచేయు
వాడెవడోవాడు రక్షింపబడును.
- రోమీయులకు - 10 : 13


Go ahead
CRISPY
mockup

Welcome to Prardhana Tv

ప్రార్ధన టీవీ ఛానల్ నిర్వాహకులు ఎస్. సుధాకర్ అరుణ గార్ల కుటుంబం విగ్రహారాధనలో నుండి జీవిత సమస్యలలో దేవుని వాఖ్యదర్శనం ద్వారా జీవిత సమస్యలను తీర్చే నాధుడని గ్రహించి సంఘానికి రావటం ప్రారంభించారు. సంఘ సహవాసములో వాక్యపు వెలుగులో దేవుని ప్రణాళికను తెలుసుకొని కేవలం జీవిత సమస్యల పరిష్కారం మాత్రమే కాక పాప విమోచన అనుగ్రహించేది యేసుక్రీస్తేయని గ్రహించి, యేసురక్షకుడని, పాపపరిహారాని, నిత్యజీవము ప్రసాదించే జీవముగల అద్వితీయ దేవుడని విశ్వసించిరి. ప్రభువును వ్యక్తిగతముగా రక్షకునిగా అంగీకరించి హృదయములో చేర్చుకుని నిర్జీవమైన పూర్వాపరంపరచారములు విడిచి... బాప్తీస్మం ద్వారా ప్రభువు నామమును బహిర్గతంగా ఘనపరిచిరి. ఈ నేపథ్యంలో నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి కుటుంబమంతా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభువుమహిమార్థమై ఇతరుల రక్షణార్ధమై దేవుని చేతిలో సాధనములుగా వాడబడుచున్నారు. ఇందును బట్టి దేవుని స్తుతిస్తున్నాము.

నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.

- కీర్తనలు - Psalms 141 : 2

Best Wishes from EPFMINDIA


ఇవాంజెలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇండియా డైరెక్టర్ గారు రెవ్. గుర్రపు. అబ్రహం సుధాకర్, సెక్రటరీ డా. జి. దేవిక గార్లు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ, సేవక బృందం, విశ్వాసులు ప్రార్ధన టి. వి ఛానల్ ఆవిష్కరణ సందర్భముగా ప్రార్ధన టి. వి డైరెక్టర్ సొంగ సుధాకర్, సి. ఇ. ఓ అరుణ గార్ల కుటుంబమునకు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, టెక్నికల్ మరియు ఆఫీస్ సిబ్బంది ద్వారా దేవాది దేవుని ప్రణాళిక సర్వమానవాళికి తెలియచేయుటకు శ్రేష్టమైన పనికి పూనుకుని లక్షలాది మంది రక్షణార్ధమై అనుభవంలోకి నడిపించబడునట్లు దేవుని చేత ప్రేరేపించబడి ప్రారంభిస్తున్న ఈ పరిచర్య కొనసాగించాలనే మహత్తర, బృహత్తర, పవిత్ర కార్యమును అనతికాలంలోనే ఉన్నత స్థాయికి పురోభివృద్ధి చెందాలని అభిలషిస్తు, ఆకాంక్షిస్తూ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు సాటిలేని నామమున శుభములు తెలుపుటకు అమితముగా ప్రభువునందు ఆనందిస్తున్నాము. EPFMINDIA కుటుంబం ద్వారా ప్రార్ధన, విజ్ఞ్యాపన, సహకారం నిరంతరం అందించెదము.

mockup

యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము

1 థెస్సలొనికయులకు - 5 : 17, 18